నేడు మునుగోడుకు రేవంత్‌ రెడ్డి.. మధ్యాహ్నం ప్రెస్ మీట్

-

మునుగోడు ఉప ఎన్నిక కారణంగా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. వరుసగా అగ్ర నేతలందరూ మునుగోడుకు వెళుతున్నారు. ఇక ఇవాళ మునుగోడు నియోజక వర్గం…నారాయణ పురం మండలానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పొర్లగూడ తండాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరేసి ఇంటింటి ప్రచారం చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ పగలు 12 గంటలకు చౌటుప్పల్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే 176 గ్రామాలకు చేరిన కాంగ్రెస్ నేతలు… అన్ని గ్రామాల్లో రాజీవ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.

మన మునుగోడు..మన కాంగ్రెస్ నినాదంతో జనంలోకి వెళ్లనుంది కాంగ్రెస్‌ పార్టీ. ప్రజా స్వామ్యం కాపాడండని పాదాభి వందనానికి రేవంత్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే లక్ష మందికి పాదాభి వందనం చేయనున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇక అటు ఇవాళ సాయంత్రం మునుగోడు నియోజక వర్గంలో కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news