రైతులకి అధిక లాభాలనిచ్చే టాప్ పది పంటలు ఇవే..!

-

రైతులు మంచి లాభం వచ్చే పంట పండిస్తే మంచిది. ఎక్కువ లాభం ఏ పంటల వల్ల వస్తోందో తెలుసుకుని ఆ పంట పండిస్తే మంచిగా లాభాలు వస్తాయి. అయితే అధిక లాభాలు ఇచ్చే టాప్ 10 పంటల గురించి ఇప్పుడు చూద్దాం.

 

చింతపండు:

ఈ మధ్యకాలంలో చింతపండుకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పైగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా ఎక్కువ సార్లు కూడా పండుతోంది. దీని వల్ల చక్కగా లాభాలు వస్తాయి.

కరివేపాకు:

అతి తక్కువ పెట్టుబడి తో ఎక్కువ రాబడి కరివేపాకు ద్వారా పొందొచ్చు. సంవత్సరం పొడవునా కూడా దీనికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు పాటు కాపు కూడా ఇస్తుంది.

పేలాల జొన్న:

బేబీ కార్న్ స్వీట్ కార్న్ తో పాటు దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. దీనితో పాప్ కార్న్ చేస్తారు.

లెమన్ గ్రాస్:

నిమ్మ గడ్డి సాగు చేయడం ఎంతో ఉపయోగకరం. పైగా దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కేజీ నిమ్మగడ్డి కి ఎనిమిది వందల రూపాయల వరకు పలుకుతోంది.

కలబంద:

కలబందకు కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది కలిపి దీనిని సాగు చేసుకుంటే బాగుంటుంది. దీని ద్వారా కూడా రైతులు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

కినోవా:

ఎకరాకు 500 కేజీల దిగుబడి వస్తుంది. ఎక్కువ ప్రోటీన్లు ఉండే చిరు ధాన్యం పంట ఇది. రైతులు ఈ పంటను కూడా మంచిగా పండించుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.

కర్బూజా:

కర్బూజా కి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ముఖ్యంగా జ్యూసులు ఎక్కువగా తయారు చేస్తుంటారు. తక్కువ రోజుల్లోనే ఈ కాయలు కాస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్:

మనకి కూడా ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతోంది. దీనిని కూడా పండించి రైతులు మంచిగా సంపాదించుకోవచ్చు. కేజీకి వంద రూపాయలు తగ్గకుండా దీని ద్వారా మనం పొందొచ్చు.

బంతిపూలు:

బంతిపూలకి డిమాండ్ బాగానే ఉంటుంది. పెళ్లిళ్లు ఫంక్షన్లు అయితే మరింత డిమాండ్ ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి రైతులు ఈ పంట వేస్తే మంచిది.

బొప్పాయి:

ఎకరాకు 25 టన్నుల దిగుబడి వస్తుంది. కాబట్టి బొప్పాయిని కూడా పండించి రైతులు మంచిగా డబ్బులు పొందొచ్చు.

తెల్ల వంకాయ:

చూడడానికి ఈ వంకాయ గుడ్డు లాగ ఉంటుంది. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది, దీనిని కూడా రైతులు పండించి చక్కటి లాభాలను రైతులు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news