కరోనా నుంచి ముందు బయటపడింది వీళ్ళీద్దరే లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా ..?

-

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నాలుగేళ్ళ తర్వాత రాం పోతినేని తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని కం బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా అందరికి మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఎప్పటి నుంచో వరుస ఫ్లాప్స్ తో హీరో రాం, అలాగే రెండు సినిమాలు చేసినా గాని సక్సస్ రాని హీరోయిన్స్, చాలా కాలం గా సక్సస్ లు అందుకోలేక కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరిమితమైన మ్యూజిక్ మణిశర్మ …ఇలా అందరూ డీలాగా ఉన్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ ఊపు నిచ్చింది.

 

దాంతో అందరూ కెరీర్ కాస్త స్పీడ్ అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఒకేసారి రెండు సినిమాలు మొదలు పెట్టారు. అందులో ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమా కాగా మరోకటి కొడుకు ఆకాష్ పూరి తో రొమాంటిక్ అనే సినిమా. అయితే ఈ సినిమాకి పూరి కథ, మాటలు మాత్రమే అందుస్తున్నారు. దర్శకత్వం వహించడం లేదు. ఈ సినిమాతో తన అసోసియోట్ అనిల్ పాడూరి దర్శకత్వ బాధ్యలు అప్పగించారు. చార్మి, పూరి నిర్మిస్తునారు.

 

ఇక సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసందే. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి అయిదు భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా అంటూ క్లారిటి ఇచ్చారు. ఇక వాస్తవకంగా ఈ రెండు సినిమాలు ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం విదేశాలలో జరగాల్సి ఉంది. పూరి విజయ్ దేవరకొండ సినిమా ఒక షెడ్యూల్ బ్యాంకాగ్ లో ప్లాన్ చేశారు. అలాగే సుకుమార్ అల్లు అర్జున్ సినిమా కూడా మొదటి షెడ్యూల్ విదేశాల్లోనే ప్లాన్ చేశారు.

 

అయితే కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు డైరెక్టర్లు సమస్యని అంచానా వేసి ఉన్నపలంగా షెడూల్ ని క్యాన్సిల్ చేశారు. ఏమాత్రం కాస్త అజాగ్రత్తగా ఉండి గనక షూటింగ్ చేసి ఉంటే యూనిట్ లో చాలా మంది కరోనా బారిన పడేవాళ్ళని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మొత్తానికి పూరి జగన్నాధ్ సుకుమార్ తీసుకున్న స్పాట్ డెసిషన్ ప్రాణ నష్టం జరగకుండా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news