ఆ దేశాల‌ను క‌రోనా క‌నీసం ట‌చ్ కూడా చేయ‌లేక‌పోయింది.. తెలుసా..?

-

దేశ‌దేశాల‌ను అస్త‌వ్య‌స్థం చేస్తున్న క‌రోనా వైర‌స్‌ను మ‌ట్టుపెట్టేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. చైనాలోని వూహాన్‌లో తొలిసారి వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం 200 దేశాలకుపైగా విస్తరించింది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌తో ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఏవైపు ఈ ర‌క్క‌సి కాటేస్తుందో అని ప్ర‌జ‌లు.. క‌రోనాను ఎలాగైనా నియంత్రించాల‌ని ప్ర‌భుత్వాత‌లు తీవ్ర ఒడిదుడుకుల‌కు గుర‌వుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా జోరు త‌గ్గ‌డం లేదు.

ఇప్ప‌టికే క‌రోనా సోకి నానా ఇబ్బందులు ప‌డుతున్న వారి సంఖ్య 20 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతుంది. మ‌ర‌ణాలు సంఖ్య ల‌క్ష దాటేసింది. ముఖ్యంగా క‌రోనా దెబ్బ‌కు పెద్ద‌న్న‌గా చెప్పుకునే అగ్ర‌రాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు విశ్వ‌రూపం చూపిస్తుంది. అయితే చాలా మంది క‌రోనా దేశాలు, దీవులు వేటినీ వదలట్లేదు. అన్ని దేశాల‌ను క‌మ్మేసింద‌ని అనుకుంటున్నారు.

కానీ, ఈ మ‌హ‌మ్మారి క‌నీసం ట‌చ్ కూడా చేయ‌ని దేశాలూ ఉన్నాయి. అవును! చాలా దేశాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్షల్ దీవులు, పలావు, నౌరు, కొమొరోస్, లెసోతో, టోన్గా, టువాలు, తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, సమోవ, కిరిబాటి, సోలమన్ దీవులు మ‌రియు వనౌటు దేశాల్లో క‌రోనా ఒక్క కేసులు కూడా న‌మోదు అవ్వ‌క‌పోవ‌డం నిజంగా విశేష‌మే. ఇక చైనాకు ప‌క్క‌నే ఉండే ఉత్తర కొరియాలో సైతం త‌మ దేశంలో ఒక్క క‌రోనా కేసు కూడా లేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news