మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాబోయే దేశాధినేతలు వీరే..!

-

  • వరుసగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ జూన్ 9 ఆదివారం రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతేకాకుండా ప్రధానీ మంత్రితో పాటు మంత్రి మండలి కూడా కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఇండియా నుంచే కాక విదేశాల నుంచి కూడా అతిథులు హాజరుకానున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావలసిందిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలువురికి ఆహ్వానాలను పంపింది. ఈ వేడుకలో పాల్గొనడానికి ఆదివారం రోజున విదేశా అతిథులు ఢిల్లీకి చేరుకుంటారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.ఇప్పటికే విదేశీ అతిథుల కోసం లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్, ఒబెరాయ్ వంటి ప్రధాన హోటళ్లు గట్టి భద్రతను కలిగి ఉన్నాయి. ఈ వేడుకకు మారిషస్ ప్రధాని- ప్రవింద్ కుమార్ జుగ్నాథ్,మాల్దీవుల అధ్యక్షుడు-డాక్టర్ మహ్మద్ ముయిజు,శ్రీలంక అధ్యక్షుడు-రణిల్ విక్రమసింఘే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు-అహ్మద్ అఫీఫ్,నేపాల్ ప్రధాన మంత్రి-పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’, భూటాన్ ప్రధానమంత్రి-షెరింగ్ టోబ్గే మొదలగు అతిథులు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version