ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే… లక్ష్మీకటాక్షమే..!

-

చాలామంది లక్ష్మీ కటాక్షం కలగాలని ఎల్లప్పుడూ ఇంట్లో సిరిసంపదలు ఉండాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినవి వీళ్లు చెప్పినవి పండితులు చెప్పినవి కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండి సిరిసంపదలతో కలకాలం ఆనందంగా ఉండాలంటే ఈ విధంగా అనుసరించండి. ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం కచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలని ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు.

- Advertisement -

కలలు కంటూ ఉంటారు. అవి నిజం అవ్వాలంటే కొంచెం మనం కూడా ప్రయత్నం చేయాలి దానికి తగ్గట్టుగా కష్టపడాలి దానితో పాటుగా ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన తలుపుకి రెండు వైపులా వినాయకుడి బొమ్మని లేదా విగ్రహాన్ని పడితే వాస్తు దోషం తొలగిపోతుంది. సుఖసంతోషాలతో ఉండొచ్చు అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కని ఇంటి ఈశాన్య దిశలో వేయండి. రోజూ నీళ్లు పోయండి. ఇలా చేయడం వలన జాతకం లో రాహువు సమస్య ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఉంటే సంపద, శ్రేయస్సు కలుగుతుంది.

ఈశాన్యం మూలలో నాటితే చక్కటి ఫలితం ఉంటుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటి ఈశాన్య వైపు టాయిలెట్ కానీ లేదంటే ఫర్నిచర్ కానీ ఉంచకండి. ఇంటి ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని పెడితే చాలా మంచి కలుగుతుంది కుబేరుడిని సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవుడిగా భావిస్తారు. అలానే వాస్తు ప్రకారం విలువైన వస్తువులు ముఖ్యమైన పత్రాలు ఇంటి నైరుతి వైపు ఉంటే ఎంతో మేలు కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అదే విధంగా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం ఉదయం పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి. అప్పుడు చక్కటి ఫలితాన్ని పొందడానికి అవుతుంది దేవుడి గదిలో కూడా లక్ష్మీదేవి విగ్రహం ఉండేటట్టు చూసుకోండి ఇలా ఈ విధంగా ఆచరిస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...