జీవితంలో ఈ మూడు ముఖ్యమైనవి : విజయ్ దేవరకొండ

-

తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఇన్సూరెన్స్, ఐడి కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ….నేను కాలేజీలో ఉన్నప్పుడు మెడికల్ బిల్లులు ఎక్కువ వస్తాయని భయపడి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవాడిని అని గుర్తు చేసుకున్నారు.కానీ ఒకటి రెండేళ్ల తర్వాత ప్రీమియం కట్టలేక డిస్ కంటిన్యూ చేసేవాడిని, అలా ఎన్ని ఇన్సూరెన్స్ లు తీసుకున్నానో? ఒక వేళ హెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఏమైనా ఎయితే ఎవరికీ కాల్ చేయాలో కూడా తెలియదు పేర్కొన్నారు.

అయితే ఇక్కడ మాత్రం చాలా పకడ్బందీగా చేస్తున్నామని అసోసియేషన్ వాళ్ళు చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే నమ్ముతా, మన జీవితంలో 3 ముఖ్యమైనవి అవి ఆరోగ్యం, ఆనందం, డబ్బు అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఈ మూడు ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ అయి ఉన్నాయని , ఒక వేళ ఆరోగ్యంగా ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదిస్తే ఇలా ఇన్సూరెన్స్లు కట్టుకుని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయవచ్చు, డబ్బు సంపాదిస్తూ ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా కూడా దానంతట అదే వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news