డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న లిక్కర్ స్కామ్ లో అరెస్టైన విషయం తెలిసిందే. ఈడీ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కవితను విచారించగా.. లిక్కర్ స్కామ్ కీలక సూత్రదారుడు కేజ్రీవాల్ అనే తేలినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మార్చి 28 వరకు కేజ్రీవాల్ కి ఈడీ కస్టడీ విధించింది. 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది రౌస్ అవెన్యూ కోర్టు. ముఖ్యంగా ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీవాల్ ని కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది.