తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఇద్దరే కేంద్ర కేబినేట్ లోకి…?

-

ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణాలో కేంద్ర మంత్రివర్గంలోకి ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై చాలానే చర్చలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళడానికి చాలామంది నేతలు ఆశపడుతున్నారు. తెలంగాణ నుంచి కూడా కొంతమంది నేతలు ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళడానికి ఆసక్తిగానే ఉన్నారని చెప్పారు. అయితే ఎవరినీ కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారు ఏంటనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి ఒక నేత పేరు ఎక్కువగా వినబడుతుంది. బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ని కేంద్ర క్యాబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేష్ ని కేంద్ర క్యాబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. వచ్చే నెలలో కేంద్ర పెద్దలు క్యాబినెట్ విస్తరణ మీద దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలో ఇక్కడి నేతల మీద కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా ప్రచారం ఉంది. అయితే ఎప్పుడు తీసుకుంటారు ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సీఎం రమేష్ కి సహాయమంత్రి పదవి కాకుండా నేరుగా క్యాబినెట్ బెర్త్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీనిపై ఇప్పటికే బీజేపీ నేతలతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. సుజనా చౌదరి కేంద్ర క్యాబినెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా సరే 2014 నుంచి 2018 వరకు ఆయన ఒకసారి క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అవసరం లేదని సీఎం రమేష్ కి ఆ బాధ్యతలు ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పారట.

Read more RELATED
Recommended to you

Latest news