ఈ మహిళలు రూ.36 వేలు పొందొచ్చు.. ఎలా అంటే..?

-

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకం వలన చాల ప్రయోజనాలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ ద్వారా మంచిగా డబ్బుల్ని పొందొచ్చు. అయితే మహిళలకు ప్రతి సంవత్సరం రూ.36 వేలు రాబోతున్నాయి. మరి ఈ స్కీమ్ కి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే… కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ లో చేరే వారికి మాత్రమే డబ్బులు వస్తాయి.

ఈ స్కీమ్ పేరు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. ఇది పెన్షన్ స్కీమ్ లాంటిది అని అనొచ్చు.ఇప్పటి వరకు 21 లక్షల మందికి పైగా చేరారు. వీరిలో దాదాపు 7 లక్షల మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ మహిళలందరికీ కూడా ఏడాదికి రూ.36 వేలు లభిస్తాయి. ఈ డబ్బుల్ని దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఇవ్వడం జరుగుతుంది.

60 ఏళ్లు వచ్చిన తర్వాతనే ప్రతి ఏడాది రూ.36 వేలు అందిస్తారు. ప్రతి నెలా రూ.3 వేల చొప్పున ఈ డబ్బులు వస్తాయి. అందరికీ ఈ స్కీమ్ లో చేరడానికి అవ్వదు. కేవలం రైతులు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. మహిళా రైతులు కూడా స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం వుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్ళు నెలకి రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి. ఒకవేళ స్కీమ్‌లో చేరిన వారు మరణిస్తే.. భాగస్వామికి సగం డబ్బులు వస్తాయి. దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి స్కీమ్‌లో చేరొచ్చు. రెండు ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు వంటివి అవసరం అవుతాయి గమనించండి.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news