మీకు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉందా…? అయితే మీకు శుభవార్త. ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో పోస్టాఫీస్ కస్టమర్లకు కాస్త ఊరట కలగనుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల విషయం లో తాజాగా సరి కొత్త నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్లకు ఊరట కలగనుంది.
పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ తో ఎప్పటికప్పుడు కస్టమర్స్ కి మంచి సేవలని ఇస్తూనే ఉంటుంది. ఇలా కస్టమర్స్ కూడా ఆయా స్కీమ్స్ తో లాభాలు పొందుతారు. ఇలా పోస్టాఫీస్‌లో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి తీపికబురు అందింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాల పై చార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. నిజంగా మినిమమ్ చార్జీలని తగ్గించడం తో కస్టమర్స్ కి బెనిఫిట్ అనే చెప్పాలి. ఇదివరకు పోస్టాఫీస్ మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు రూ.100గా ఉండేవి. కానీ ఈ సరి కొత్త నిర్ణయం తీసుకోవడం తో అది ఇప్పుడు యాభై రూపాయలకి చేరింది.
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ స్కీమ్ 2019కు సవరణలు చేయడం ద్వారా చార్జీలు తగ్గిస్తున్నామని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇది ఇలా ఉంటే పోస్టాఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ తప్పక ఉండాలి. లేదంటే చార్జీలు తప్పవు గమనించండి. ఇది ఇలా ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను విధించడం లేదు.