నాగబాబు ఆస్తి గురించి అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై..

-

మెగా బ్రదర్ నాగబాబు అటు అన్నలా, ఇటు తమ్ముడిలా పెద్ద స్టార్ కాలేకపోయినా.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. బుల్లితెర మీద కూడా షోలకు జడ్జిగా చేస్తూ తన మార్క్ చూపించారు. అంతే కాదు తనకంటూ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఇది కూడా బాగానే పాపులర్ అయింది.

నాగబాబు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించకపోయినా సోషల్‌ మీడియాలో ద్వారా నిత్యం ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటారు. అంతే కాదండోయ్ అప్పుడప్పుడు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు కూడా తనదైన స్టైల్‌లో సెటైర్ వేస్తూ బదులిస్తుంటారు. కాగా రీసెంట్ గా ఆయన ఓ నెటిజన్ తో చేసిన కామెంట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దామా.

తాజాగా ఆస్క్‌ మి ఏ క్వశ్చన్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నాగబాబు లైవ్‌ చాట్‌ లో ముచ్చటించారు. ఇదే అదునుగా ఓ నెటిజన్‌..’ఎంత ఆస్తి ఉంది నీకు’? అంటూ మెగా బ్రదర్ను ప్రశ్నించాడు. దీంతో నాగబాబుకు కోపం వచ్చి.. తనదైన స్టైల్ లో జవాబిచ్చాడు. ‘నన్ను నువ్వు అని సంబోధించావు..గౌరవం తగ్గిపోయింది సో నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను. మీకు మీకు ఎంత ఆస్తి ఉంది? అని అడిగితూ కచ్చితంగా చెప్పేవాడిని. అంతే కాదు నా ఆస్తిలో సగం ఇచ్చేవాడిని .. బ్యాడ్ లక్’ అంటూ చురకలంటించారు. ఇక మరో నెటిజన్‌.. ‘సర్‌ మీరు ఉండే ఇల్లు రేటు రూ. 50 కోట్లు ఉంటుందా’ అని అమాయకంగా అడిగాడు. దీనికి కూడా మెగా బ్రదర్ ఓ కౌంటర్ విసిరాడు. ‘ముకేష్ అంబానీ ఇంటి కంటే పది రూపాయలు తక్కువ అంతే. మిగిలినదంతా సేమ్ టూ సేమ్’ అని సెటైర్ వేసేశాడు. ఇగ నెట్టింట్లో ఈ కామెంట్లు విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news