స్టీల్ పాత్రల్లో వీటిని అస్సలు వండకూడదు..!

-

మనం మామూలుగా వంట చేసుకునేటప్పుడు స్టీల్ పాత్రలని వాడుతుంటాము. స్టీల్ పాత్రలో వండుతూ ఉంటాము. అయితే కొన్ని ఆహార పదార్థాలను మాత్రం అసలు స్టీల్ వాటిల్లో స్టీల్ వండకూడదు. మరి అలా స్టీల్ వాటిల్లో వేటిని వండకూడదు అనే విషయాన్ని చూద్దాం. స్టీల్ పాత్రలో అస్సలు ఈ వంటలని చేసుకోకూడదు. మాంసాహారాన్ని స్టీల్ పాత్రలో ఉండకూడదు నాన్ వెజ్ వంటలు పూర్తవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఐరన్ పాత్రలలో వండుకుంటే మంచిది.

 

స్టీల్ పాత్రలో యాసిడ్ ఫుడ్ ని వండుకోకూడదు. అంటే పులుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని వండుకోకండి. పులుపు ఎక్కువగా ఉన్న వాటిని వండితే స్టీల్ లోహం కాబట్టి ఆమ్లంతో చర్య జరుగుతుంది దాంతో సమస్య కాబట్టి అసలు వీటిని కూడా వండకండి ఎక్కువ సేపు స్టైన్లెస్ స్టీల్ లో ఉండిన ఆహార పదార్థాలను ఉంచకండి. ఆహార పదార్థాలని వేరే పాత్రలోకి మార్చుకోండి.

అలానే స్టీల్ పాత్రలో ఉండే ఆహారాలని డైరెక్ట్ గా మైక్రోవేవ్ ఒవేన్ లో పెట్టకండి దీని వలన స్టీల్ పాత్రలు పాడవుతాయి. కాబట్టి అలా చేయకండి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా స్టీల్ వాటిల్లో పెట్టకండి ఉదాహరణకి ఊరగాయలు. ఊరగాయలు వంటి వాటిని స్టీల్ వాటిలో పెడితే పాడైపోతాయి. స్టీల్ వాటిల్లో నూనె వేసేటప్పుడు ఎక్కువ నూనె పడుతుంది లేదంటే ఉష్ణోగ్రత ఎక్కువ అయినప్పుడు ఆహారం స్టీల్ పాత్రకి అంటుకుపోతుంది. స్టీల్ పాత్రలో ఏ ఆహారాన్ని కూడా డీప్ ఫ్రై చేయకండి స్టీల్ వాటిలో స్మోక్ పాయింట్ తక్కువ ఉంటుంది. డీప్ ఫ్రై చేయడం వలన ఆ గిన్నె పసుపు రంగులోకి మారిపోతుంది. స్టీల్ పాత్రలో వండుకునేటప్పుడు ఎక్కువ మంటని పెట్టకండి ఇలా స్టీల్ వాటిలో ఆహారాన్ని వండేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news