మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, ఇతను తన కెరీర్ లో బ్యాట్ పట్టుకుంటే సిక్సు కొట్టేవాడు.. అందుకే ఇతనికి సిక్సర్ల సిద్దు అని కూడా పేరుంది. క్రికెట్ తర్వాత రాజకీయాలను తన కెరీర్ గా మలుచుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నిన్న రాత్రి సిద్దు ఇంట్లోకి దొంగ వచ్చాడట. ఈ మధ్యనే ఇతను జైలు నుండి విడుదలయ్యాడు.. ఈ లోపలే ఇలా జరగడం నిజంగా బాధాకరం అని చెప్పాలి. అయితే గత రాత్రి సిద్దు ఇంటి మేడపైకి ఒక గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడట.
అయితే ఆ సమయానికి తన ఇంట్లో పనిచేసే మనిషి అతడిని చూసి కొంచెం కేకలు వేయడంతో దూకి పారిపోయాడట. ఆ మనిషి తెలిపి విధంగా సదరు వ్యక్తి దుప్పటి కప్పుకుని ఉన్నాడట, ఆయుధాలు కూడా తన వెంట తెచ్చుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. దీనితో తన ఇంటి భద్రతపై సిద్దు ఆందోళన పడుతున్నారు.