జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ కి కొత్తగా బిఆర్ఎస్ పై ప్రేమ పుట్టుకు వచ్చిందని మండిపడ్డారు. తల్లి లాంటి ఏపీని అవమానిస్తే పవన్ కళ్యాణ్ కు బాధ లేదా..? అని ప్రశ్నించారు పేర్ని నాని. అసత్యాలను తమపై రుద్ది పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. వ్యాపారాల కోసమే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పాకులాడుతున్నారని ఆరోపించారు.
అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణ మంత్రులపై ఈగ వాళ్లని ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాళ్లకు లొంగిపోయావా..? లేదా కొత్త బంధమా..? అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు భోజనం మానేశా అన్న పవన్ కళ్యాణ్.. ఏపీ పై తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తే ఎందుకు మద్దతు పలుకుతున్నాడని ప్రశ్నించారు.