ఆర్ఆర్ఆర్ లో మూడో హీరోయిన్ ఎంట్రీ…!

-

ఆర్ఆర్ఆర్’ టాలివుడ్ తో పాటుగా బాలివుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఇది. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణాకు చెందిన కొమరం భీమ్ లు కలిస్తే ఎలా ఉంటుందో అనే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై టాలివుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

దాదాపు సగానికి పైగా షూటింగ్ ఈ సినిమా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన అలియా బట్ నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన ఒలివా మోరిస్ నటిస్తుంది. రామ్ చరణ్,ఎన్టీఆర్ లపై క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఉందని అంటున్నారు. ఇక తాజాగా మరో హీరోయిన్ పేరుని బయటకు విడుదల చేసింది చిత్ర యూనిట్.

మరో హీరోయిన్‌గా శ్రియ నటిస్తుంది. అజయ్ దేవ్‌గణ్ సరసన ఆమె నటిస్తోంది. గతంలో వీరు ‘దృశ్యం’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్‌లో శ్రేయా జాయిన్ అవగా వీరిద్దరిపై వికారాబాద్ అడవుల్లో షూటింగ్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దాదాపు 10 భాషల్లో వస్తున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news