ఇవాళ్టి నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వాహనసేవలు ప్రతినిత్యం ఉదయం 9 గంటలకు….రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామని… గరుడ వాహన సేవను రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూన్నామని.. ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడంతో స్వర్ణరథం,మహరథం బదులుగా సర్వభూపాల వాహన సేవను నిర్వహిస్తామన్నారు.
చక్రస్నాన కార్యక్రమాని ఆలయంలోని అద్దాల మహల్ లో నిర్వహిస్తామని.. రాష్ర్ట ప్రభుత్వం తరపున 11వ తేదిన సియం జగన్ పట్టువస్ర్తాలను సమర్పిస్తారని ప్రకటించారు. 11వ తేదిన బర్డ్ హస్పిటల్ ప్రాంగణంలో పిడియాట్రిక్ కార్డిక్ హస్పిటల్ ,గో మందిరం,అలిపిరి నడకమార్గాని సియం జగన్ ప్రారంభిస్తామని… 12వ తేదిన అదనపు బూందీ పోటు,యస్వీబిసి కన్నడ హిందీ చానల్స్ ని సియం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. కన్నడ చానల్ ప్రారంభోత్సవంలో కర్నాటక సియం బోమ్మై పాల్గోంటారని.. 13 జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులను ఉచితంగా దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. టిటిడి వాహనాల ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తరలిస్తామన్నారు.