ఈ బ్యాంక్ కస్టమర్స్ కి షాక్.. కొత్త రూల్స్ ఇవే..!

-

ఈ బ్యాంక్ కస్టమర్స్ కి షాక్. కొత్త రూల్స్ వచ్చాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ అనేక కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. బ్యాంకు అకౌంట్ల విషయంలో మార్పులు చేసింది బ్యాంక్. పలు కేటగిరీల్లో ఉన్న సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబధించి మినిమమ్ బ్యాలెన్స్ యొక్క రూల్స్ మారాయి.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఫ్రీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిమిట్‌ను కూడా తగ్గించింది యాక్సిస్ బ్యాంక్. ఈ కొత్త రూల్స్ ని యాక్సిస్ బ్యాంక్ అమలు చేసింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఈజీ సేవింగ్స్ అకౌంట్ లేదా అలాంటి అకౌంట్ వున్నట్లయితే మినిమమ్ బ్యాలెన్స్ రూ.12,000 తప్పక ఉండాలి అని బ్యాంక్ అంది. అయితే గతం లో చూస్తే ఇది రూ.10,000 మాత్రమే ఉండేది.

కానీ ఇప్పుడు పెంచారు. అయితే ఈ రూల్ అన్ని డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఈజీ అకౌంట్, డిజిటల్, సేవింగ్స్ SBEZY, స్మార్ట్ ప్రివిలేజ్ అకౌంట్స్ పై వర్తిస్తుంది. అదే సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, రూరల్ ప్రాంతాల్లో రూ.2,500 మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి. ఇంత మొత్తం బ్యాలెన్స్ లేదు అంటే చార్జీలు చెల్లించాలి. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే తక్కువగా ఉన్న ప్రతీ రూ.100 కి రూ.5 చొప్పున మంత్లీ సర్వీస్ ఫీజు కట్టాలి.

అలానే రూ.75 లేదా రూ.250 అదనంగా ఛార్జీ పే చెయ్యాలి. అలానే ఉచిత క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.2,00,000 నుంచి రూ.1,50,000 కి తగ్గించింది. గతం లో చూస్తే మొదటి నాలుగు లావాదేవీలు లేదా రూ.2,00,000 ఏది ముందైతే అది ఉచిత క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్‌గా ఉండేది. కానీ ఇప్పుడైతే రూ.1,50,000 గా లిమిట్ చేసారు. యాక్సిస్, నాన్ యాక్సిస్ ఏటీఎంలో ఫ్రీ లిమిట్ కన్నా ఎక్కువ సార్లు క్యాష్‌విత్‌ డ్రాయల్ చేస్తే ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.21 చెల్లించాలి. అదే లిమిట్ కంటే ఎక్కువ సార్లు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.10 చెల్లించాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news