మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మహరాష్ట్ర మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. మే 3లోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తీసేయాలని హెచ్చరించారు. లేకపోతే మసీదుల ముందే హనుమాన్ చాలీసా వినిపిస్తాం అంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తాను హిందువుల కోసం మాట్లాడుతుంటే.. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని అంటే బీజేపీ బీ టీమ్ అంటూ విమర్శిస్తున్నారని ఈ విమర్శలను తోసిపుచ్చారు. మేం ప్రార్థనకు వ్యతిరేఖం కాదని… లౌడ్ స్పీకర్ల వల్ల ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇబ్బందుల పడుతున్నారని.. ప్రభుత్వం సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలను అమలు పరచడంతో ఘోరంగా విఫలం అయ్యారని విమర్శించారు. శరద్ పవార్, నరేంద్ర మోదీని కలువడం కూడా రాజ్ ఠాక్రే స్పందించారు. ఈ సమావేశం వెనక అజిత్ పవార్అతని సమీప బంధువులు మరియు ఇతర పార్టీ నాయకుల ఆస్తులపై జరిపిన దాడులకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఆజాద్ మైదాన్‌లో రజా అకాడమీ హింసాత్మక నిరసనకు వ్యతిరేకంగా బాలీవుడ్ నుంచి పాకిస్తాన్ కళాకారులను బహిష్కరించాలని తన పార్టీ మొదటిసారిగా గళం విప్పిందని గుర్తు చేశారు.
మే 3 లోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలి… మహారాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ ఠాక్రే వార్నింగ్
By Advik
-