ఇదో మంచి ఆలోచన.. ఆనంద్ మహీంద్రా

-

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను పారిశ్రామిక దిగ్గజం ‘ఆనంద్ మహీంద్రా’ షేర్ చేస్తూ ఉంటారు.తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ఇదో మంచి ఆలోచన అంటూ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

పెద్ద నగరాల్లో వర్షం పడితే ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తానికి ముంబైలో రుతుపవనాలు కొంత తగ్గుముఖం పట్టాయి అంటూ ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి గొడుగును.. బ్యాగ్ మాదిరిగా తగిలించుకుని వెళ్లడం చూడవచ్చు. గొడుగుకు రెండువైపులా ఇనుప తీగల వంటి పరికరాలను అమర్చుకుని ఒక బ్యాగ్ మాదిరిగా తగిలించుకున్నారు. దీంతో గొడుగును పట్టుకోవడానికి ప్రత్యేకంగా చేతులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీడియోలో గొడుగును తగిలించుకుని చేతులతో వస్తువులను తీసుకెళ్లడం కూడా చూడవచ్చు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో వ్యూవ్స్ పొందిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు మహీంద్రా గొడుగులు కావాలని కామెంట్ చేస్తే.. మరొకరు హ్యుయెన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో ఇలాంటిది కలిగి ఉన్నారని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news