ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రత్యర్థి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులే లక్ష్యంగా పని చేస్తున్న ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమంలో భాగమైన మేనిఫెస్టోలోని అంశాలను వదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్.. కేవలం రెడ్ బుక్ పైనే దృష్టి పెట్టినట్లు ఉన్నారని అంబటి ఎద్దేవా చేశారు. ‘రెడ్ బుక్ ని కాదు, మేనిఫెస్టోని అమలు చేయండి అంటూ తన ‘ఎక్స్’ హ్యాండిల్ వేదికగా ట్వీట్ చేశారు అంబటి రాంబాబు.
మరోవైపు జగన్ పై కేసు నమోదు పై అంబటి రాంబాబు ఇలా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా జగన్ ను ఇబ్బంది పెట్టాలనే కుట్రతో కేసు పెట్టారు. చంద్రబాబు, లోకేష్, రఘురామ రాజు కుట్రతో కేసు పెట్టారు. రఘురామ రాజు గతంలో మా పార్టీ ఎంపీనే. 11న ఫిర్యాదు అందితే 10న లీగల్ ఒపీనియన్ కు పంపటం బట్టే పోలీసులు తప్పు చేస్తున్నట్టు అర్దం అవుతోంది. పొలిటికల్ ప్రెజర్ తో కేసులు పెడితే రానున్న రోజుల్లో పోలీసులకు ఇబ్బంది తప్పదని.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న పోలీసులు ఆలోచన చేయాలన్నారు.