రూ.773.8 కోట్లకు చేరిన డీ-మార్ట్ లాభాలు

-

డీ-మార్ట్ ఆధ్వర్యంలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్ తాజాగా తన ఆర్థిక ఫలితాలను రిలీజ్ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ.773.8 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే రూ.658.8 కోట్ల నుండి 17.5 శాతం పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా ప్రతి సంవత్సరం ఆదాయం రూ.11,865.4 కోట్ల నుండి రూ.14,069.1 కోట్లకు చేరింది.వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన(ఎబిటా) ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,035.3 కోట్లు గా నమోదు కాగా ఇప్పుడు అది రూ.1,221.3 కోట్లకు పెరిగింది.

అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఎండీ మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆదాయం క్రమంగా పెరిగిందని అమ్మకాలు మెరుగ్గా ఉండటం వలన ఇది సాధ్యమైందని తెలిపారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి, భవిష్యత్తు కోసం సామర్థ్యాన్ని పెంపొందించడంపై నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news