ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధంమవుతోంది. మరో 2 రోజుల్లో కీలకమైన ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ క్రమంలో.. అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, మంచి పనులు వివరిస్తూ ప్రచారంలో బిజీబిజీగా ముందుకెళ్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మరోసారి ఆశీర్వాదించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని మొత్తం చుట్టేశారు. కాగా.. రేపు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 10వ తేదీ (రేపటి) షెడ్యూల్ వైసీపీ విడుదల చేసింది.శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. అక్కడి నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మొత్తంగా రేపు 3 నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు.