వరుస ఓటములపై హర్దిక్ పాండ్యా రియాక్షన్ ఇదే

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసి భారీ ఓటమి మూటకట్టుకుంది.

ఈ నేపథ్యంలో కెప్టెన్ పాండ్యా పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశాడు కెప్టెన్ పాండ్యా. ఎక్స్‌ వేదికగా మంగళవారం ఓ పోస్టు చేశాడు. ముంబై జట్టు ఫొటోను షేర్ చేసిన అతను.. ‘ఈ జట్టు గురించి ఏదైనా మీకు తెలుసుకోవాలనుకుంటే.. మేము ఎప్పటికీ వెనక్కి తగ్గం అని పేర్కొన్నారు. మేము పోరాడుతూనే ఉంటాం. ముందుకు వెళ్తూనే ఉంటాం.’ అని ఎక్స్(ట్విట్టర్) లో రాసుకొచ్చాడు. కాగా, ముంబై జట్టు తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మరి ఈ మ్యాచ్ లోనైనా ముంబై ఇండియన్స్ గెలుస్తుందో లేదో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news