అసదుద్దీన్ ఓవైసీతో నల్గొండ గద్దర్ భేటీ..!

-

ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో ప్రముఖ సింగర్, నర్సన్న అలియాస్ నల్గొండ గద్దర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఎంఐఎం పార్టీ ఆఫీస్ దారుస్సలాంలో ఓవైసీతో నర్సన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ఎంఐఎం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సన్న రేవంత్ రెడ్డిపై పాడిన ‘మూడు రంగుల జెండా ‘పట్టి..’ పాట పొలిటికల్ సర్కిల్ లో పొలిటికల్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అలాంటి నల్గొండ గద్దర్ తాజాగా ఎంఐఎం చీఫ్ తో ఆకస్మికంగా భేటీ కావడం వెనుక ఉద్దేశం ఏంటనేది చర్చగా మారింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నర్సన్న ఏపీ సీఎం జగన్ తో పాటు పలువురు నేతలపై పొలిటికల్ సాంగ్స్ పాడుతున్నాడు. వీరి భేటీ వెనుక కూడా ఓవైసీపై ఏదైనా సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారా? లేక భేటీ వెనుక మరేదైనా కారణ ఉందా అనేది ఉత్కంఠగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news