వార్నీ.. బ్యాంకుల‌కు ఈ బాదుడు వ‌ల్లే ఆదాయం బాగా వస్తుంది క‌దా..!

-

బ్యాంక్ అకౌంట్ల‌లో మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయ‌క‌పోతే ఖాతాదారుల‌కు ఫైన్ ప‌డుతుంద‌న్న విష‌యం తెలిసిందే. అయితే దేశంలో ఉన్న 21 ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, మ‌రో మూడు ప్ర‌ముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు క‌లిపి ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రంలో అలాంటి క‌స్ట‌మ‌ర్ల‌పై జ‌రిమానా ఎంత వేశాయో తెలుసా..? అక్ష‌రాలా.. రూ.4,989 కోట్లు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. లోక్ స‌భ‌లో కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి శివ్ ప్ర‌తాప్ శుక్లా ఈ వివరాల‌ను వెల్ల‌డించారు.

2017-18 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను స‌ద‌రు బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఉంచ‌ని క‌స్ట‌మ‌ర్ల నుంచి అంత పెద్ద మొత్తంలో ఫైన్ల‌ను వ‌సూలు చేశాయి. ఇక ఈ జాబితాలో అత్య‌ధికంగా ఫైన్ల‌ను వ‌సూలు చేసిన బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచింది. గ‌త సంవ‌త్స‌రానికి గాను ఎస్‌బీఐ వ‌సూలు చేసిన ఫైన్ మొత్తం అక్ష‌రాలా రూ.2,433.87 కోట్లు. దీని త‌రువాత స్థానంలో వ‌రుస‌గా హెచ్‌డీఎఫ్‌సీ (రూ.590.84 కోట్ల ఫైన్ వ‌సూళ్లు), యాక్సిస్ బ్యాంక్ (రూ.530.12 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.317.6 కోట్లు), పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (రూ.211 కోట్ల వ‌సూళ్లు)లు నిలిచాయి.

మొత్తానికి బ్యాంకుల‌కు క‌స్ట‌మ‌ర్ల నుంచి ఇత‌ర మార్గాల్లో క‌న్నా ఇలా మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల క‌డుతున్న ఫైన్ల నుంచే అధికంగా లాభం వ‌స్తున్న‌ట్లు మ‌న‌కు తెలుస్తోంది. వాటిల్లో అన్నింటిక‌న్నా ఎస్‌బీఐ ముందు వ‌రుస‌లో నిల‌వ‌డం విశేషం. ఆ బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ లేక‌పోతే ఫైన్ వేయ‌డం ప్రారంభించిన ద‌గ్గ‌ర్నుంచీ ఏటా బాగానే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఏది ఏమైనా.. చివ‌రికి లాస్ క‌స్ట‌మ‌ర్ల‌కే..! ఏం చేస్తాం.. అలా ఉంది జ‌మానా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version