శ్రావణ మాసంలో మీరు పెళ్లి చేసుకుంటున్నారా..? లేదంటే శ్రావణ మాసంలో మీకు తెలిసిన వారి పెళ్లి జరుగుతుందా..? అయితే ఈ విషయం వారికి చెప్పండి. ఎందుకంటే.. రానున్న శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే జంటలకు ఉచితంగా పట్టు వస్త్రాలు వస్తాయి. అది ఎలా..? అనేగా మీ అనుమానం.. అయితే ఇంకెందుకాలస్యం.. పట్టు వస్త్రాలు ఎలా వస్తాయో తెలుసుకోవాలంటే ఇది చదవండి.
ఏమీ లేదండీ.. దిల్ రాజు నిర్మాణంలో నితిన్, రాశీ ఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కల్యాణం. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సాధించింది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా దిల్‌రాజు టీం ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అదేమిటంటే…
రానున్నది శ్రావణ మాసం కదా. ఆ మాసంలో పెళ్లిళ్లు కూడా జరుగుతాయి. అయితే ఆ మాసంలో పెళ్లి చేసుకోబోయే వారు తమ శుభలేఖలను పంపిస్తే చాలు… వారికి పట్టు వస్త్రాలను చిత్ర యూనిట్ కానుకగా ఇవ్వనుంది. అయితే ఈ అవకాశం అందరికీ కాదు సుమా. తమకి వచ్చే శుభలేఖల్లోంచి కొన్నింటిని డ్రా తీసి వారికి మాత్రమే ఆ దుస్తులను అందిస్తారు. అంతేకాదు, శ్రీనివాస కల్యాణం టీంతో మాట్లాడే అవకాశాన్ని ఆ నూతన జంటలకు కల్పిస్తారు. మరింకెందుకాలస్యం.. మీరు పెళ్లి చేసుకోబోతున్నా.. లేదా మీకు తెలిసిన ఎవరికైనా పెళ్లి జరుగుతున్నా ఈ విషయాన్ని చెప్పండి.. పట్టు వస్త్రాలను ఉచితంగా పొందండి. సినీ నటులతో మాట్లాడే అవకాశాన్ని దక్కించుకోండి..!