బల్కీ యూట్రస్ తో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా తగ్గించుకోవచ్చు..!

-

స్త్రీలకు చెప్పుకో లేని సమస్యలు చాలా ఉంటాయి. వాళ్లు ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేసినా దాని ఎఫెక్ట్ పిరియడ్స్ మీదే పడుతుంది. గర్భాశయంలో సమస్యలు, ఓవరీస్ లో బుడగలు, యూట్రస్ బల్కీ ఇలా ఏవేవో వెంటాడుతుతాయి. ఈరోజు మనం బల్కీ యూట్రస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, నాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం..!

స్త్రీలల్లో ఉండే గర్భాశయం ఉండవలసిన ఆరోగ్యకరమైన సైజ్ కంటే..పెద్ద సైజు అయినప్పుడు.. గర్భం లేని సమయాల్లో కూడా గర్భాశయం సైజు పెరిగితే దాన్నే బల్కీ యూట్రస్ అంటారు. అసలు ఎంత సైజు ఉండాలి. ఎంతకు మించి పెరిగితే దాన్ని బల్కీ యూట్రస్ అంటారంటే..

గర్భాశయం ఉండాల్సిన సైజ్

యూట్రస్ అనేది 60-70 గ్రాముల బరువు, 7.6 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు 4.5 సెంటీమీటర్లు, 3 సెంటీ మీటర్ల మందం ఉంటుంది. దీనికంటే భిన్నంగా సైజు వెడల్పులో, మందంలో పెరిగితే.. దాన్ని బల్కీ యూట్రస్ అంటారు.

బల్కీ యూట్రస్ లక్షణాలు:

పిరియడ్స్ లో హెవీ బ్లీడింగ్..దీనివల్ల బ్లడ్ బాగా లాస్ అవుతుంది.

పిరియడ్స్ కూడా నెలనెల రావు. ఇరెగ్యులర్ గా ఉంటుంది సైకిల్.

పొత్తికడపుపు బాగా అంతా పెయిన్ గా ఉంటుంది.

తరచూ యూరిన్ వెళ్లాలనే ఫీలింగ్

బ్రస్ట్ లో వాపు రావడం

అవాంఛితరోమాలు ఎక్కువగా ఉండటం

బాగా బలహీనంగా ఉండటం

ఇవి ఎక్కువగా బల్కీ యూట్రస్ లక్షణాలు.. అసలు ఇది రావడానికి కారణాలు ఏంటి..?

స్త్రీలల్లో చాలామందికి మెనోపాస్ సమయంలో ఎక్కువగా హార్మోన్ ఫ్లక్చువేషన్స్ రావడం వల్ల యూట్రస్ బల్కీ అవుతుంది. గర్భాశయం లోపల ఫైప్రాయిడ్స్ గడ్డలు( Fibroids) వచ్చినప్పుడు.. గడ్డ సైజు పెరిగే కొద్ది.. గర్భాశయం సైజు పెరుగుతుంది.

కొందరికి ఎండోమెట్రియాసిస్ వల్ల కూడా యూట్రస్ బల్కీగా అవుతుంది.

ఓవరీస్ లో బుడగలు వచ్చినప్పుడు..కూడా బల్కీగా అవుతుంది.

యూట్రస్ లోపల ఎడినోమయోసిస్ ( Adenomyosis) కండరాల్లో ఎండోమెట్రియం కణజాలం పెరగడం వల్ల

గర్భాశయ సంబంధమైన కాన్సర్స్ వచ్చినప్పుడు కూడా సైజ్ బల్కీ అవుతుంది.

ఓవరీస్ లో పాలిస్( Polyps), చాక్లెట్స్ సిస్ట్స్( Chocolate cysts) ఉన్నప్పుడు కూడా సైజు పెరుగుతుంది. ఇవన్నీ బల్కీ యూట్రస్ రావడానికి కారణాలు..

ఈ సమస్యకు పరిష్కారం ఏంటి..?

రోజు టబ్ బాత్ ఇలాంటి సమస్య ఉన్నవారి చాలా మంచిది.టబ్ లో కాళ్లు పైకి పెట్టి.. తొడభాగం నుంచి బొడ్డు భాగం వరకూ వాటర్ లో ఉండేట్లు కుర్చుంటే..బ్లడ్ సర్కూలేషన్ బాగా అవుతుంది. యూట్రస్ మజిల్ కి మంచి ఎక్సర్ సైజ్ అవుతుంది. రెగ్యులర్ గా చన్నీళ్లతో ఇలా 20 నిమిషాలు చేయొచ్చు.

పొట్టను తగ్గించి, పొత్తికడుపుమీద బాగా పనిచేసే ఆశనాలు ఉంటాయి. యుత్పానపాదాసన్( Uttanpadasana) నౌకాసన్( naukasana) చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకు రెండు మూడు సార్లు చేయొచ్చు. అబ్డామినల్ ఎక్సర్ సైజ్ చేసుకోవడం కూడా మంచిది.

ఆహార నియమాల విషయానికి వస్తే.. ఉదయం పూట వీట్ గ్రాస్ లేదా, వెజిటబుల్ జ్యూస్ కంపల్సరీగా తీసుకోండి. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ లో రెండుమూడు రకాల మొలకలు తీసుకోవడం, మధ్యాహ్నం ఆకుకూరలను కచ్చితంగా పెట్టుకోండి, సోయాచిక్కుడు కూడా డైలీ డైట్ లో ఉంచుకుంటే.. ఇస్ట్రోజన్ హార్మోన్ కు బాగా మేలుచేస్తుంది. ఈవినింగ్ చెరుకు లేదా బత్తాయి రసం తీసుకోవడం, డిన్నర్ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. 6.30 కే.. నానపెట్టిన ఎండువిత్తనాలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్ నట్స్, హెంప్ సీడ్స్, పుచ్చగింజల పొప్పు ఇవన్నీ నానపెట్టుకుని పండ్లు రెండు తీసుకుంటే..యూట్రస్ పెరగకుండా.. లైనింగ్ అంతా కరెక్టు గా ఉండి.. హెవీ బ్లీడింగ్ కూడా లేకుండా హాయిగా ఉంటుంది.

నాచురల్ డైట్ హార్మోన్ ఇంబాలెన్స్ సమస్యను తగ్గించడానికి మేలు చేస్తుంది. ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో.. నాచురల్ గా పైన చెప్పిన పద్దతులు పాటిస్తే.. సమస్య నుంచి బయటపడొచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version