అజయ్, సిద్దార్థ్ లతో నాకున్న బంధం ఇదే: రకుల్..!

-

ఎక్కువగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మాత్రం తను ఎక్కువగా బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది. అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అవకాశాలను సంపాదించుకున్నది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా బాగానే అందుకుంటున్నట్లుగా సమాచారం. ఈమె నటించిన చిత్రాలు ఎన్ని డిజాస్టర్ లు వచ్చినా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆమె నటించిన హీరోలతో మళ్లీ నటించి మంచి అవకాశాలను అందుకుంటోంది. ఇక ఇదివరకే అజయ్ దే, సిద్ధార్థ మల్హోత్రా వంటి వారితో రెండు సినిమాలు చేసింది.

ఇప్పుడు మళ్లీ వీరిద్దరితో కలిసి నటించడానికి మరొక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక వీరితో తనకు వున్న అనుబంధం గురించి ఆమె చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదివరకే రకుల్ ప్రీత్ సింగ్ దే దే ప్యార్ దే ,రన్ వే -34 వంటి సినిమాలలో నటించింది అలాగే మరొకవైపు సిద్ధార్థ తో అయ్యారే, మార్జావన్ ఇలాంటి సినిమాలలో నటించింది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమాలతో బాలీవుడ్ బాక్స్ ఆఫీసు దగ్గర సక్సెస్ కాలేదు. కానీ గ్లామర్ బ్యూటీ గా మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ ఇండస్ట్రీ వారు అవకాశాలు బాగానే ఇస్తున్నారు. ప్రస్తుతం అజయ్ దేవగన్, సిద్ధార్థ మల్హోత్రా తో కలసి థాంక్ గార్డ్ అనే చిత్రంలో నటిస్తున్న ది. విభిన్నమైన డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రకుల్ వారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది. తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన నటుడు అజయ్ దేవగన్ అని తెలియజేసింది. ఆయన ఎలాంటి సలహా ఇచ్చినా కూడా పాజిటివ్ గానే తీసుకుంటారని తెలిపింది. ఇక సిద్ధార్థ అయితే తనకు మంచి స్నేహితుడని మొదటి పరిచయంలోనే మంచి స్నేహం ఏర్పడింది అని తెలియజేసింది. ఆ కారణంగానే వీరిద్దరితో కలిసి బాగా నటిస్తున్నానని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news