ఫిట్నెస్ మంత్ర ఇదే.. ఎట్టకేలకు నోరు విప్పిన మిల్క్ బ్యూటీ ..!

-

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈమె దాదాపు 18 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకగా కొనసాగుతోంది. తాజాగా భోళా శంకర్, జైలర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు తెలుగు, హిందీ , తమిళ్ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటూ మరింత బిజీగా దూసుకుపోతోంది. తమన్నా ప్రస్తుతం వయసు 33 సంవత్సరాలు.. ఇదిలా ఉండగా ఈ వయసులో కూడా ఇంత అందంగా.. ఇంత ఫిట్నెస్ ఫ్రీక్ మైంటైన్ చేయడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.

అమ్మాయిలే కాదు స్టార్ సెలబ్రిటీలు కూడా ఈమె అందం చూసి కుళ్ళుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. ఇక దీన్ని బట్టి చూస్తే తమన్నా ఇంత అందం, ఫిట్నెస్ మైంటైన్ చేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. ఎట్టకేలకు ఆమె నోరు విప్పి తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించింది.. ఎట్టకేలకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన అందానికి సంబంధించిన రహస్యాన్ని వెల్లడించింది. ఈ గ్లామర్ ప్రపంచంలో ఫిట్ గా ఉండడం చాలా అవసరమని, అందుకు జిమ్ వర్కౌట్స్ చేయడమే కాకుండా ఆహారపు అలవాట్ల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు.

ఉదయం లేవగానే అరటి పండ్లు, ఖర్జూర పండ్లు, నట్స్ సమాన నిష్పత్తిలో తీసుకుంటాను. మధ్యాహ్నం భోజనం సమయంలో పప్పు, బ్రౌన్ రైస్, కాయకూరలు తప్పకుండా ఉండేలా చూసుకుంటాను.. అదేవిధంగా సాయంత్రం 5:30 కే డిన్నర్ ముగించేసుకొని ఆ తర్వాత మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తినను అంటూ ఆమె తెలిపింది. సుమారుగా 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం వల్లే నా చర్మం కాంతులీనితోందని, అంతేకాదు హెల్దీగా ,ఫిట్ గా కూడా ఉంటానని ఆమె తెలిపారు. అలాగే గ్రీన్ టీ , ఆమ్లా జ్యూస్ వంటివి కూడా తన ఆరోగ్య రహస్యంలో ఒక భాగం అని తెలిపింది తమన్నా.

Read more RELATED
Recommended to you

Latest news