తెలంగాణకు,హైదరాబాద్ కు భూకంపాలు రావని మేము ఎప్పుడు చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు NGRI శాస్త్రవేత్త నగేశ్. బోరబండ, గచ్చిబౌలి ఎన్జీవోస్ కాలనీల్లో భూకంపం వచ్చిన మాట వాస్తవమే అని నగరంలో తీవ్ర భూకంపాలు మాత్రం రావని చెప్పగలం అన్నారు.
భూమి పొరల్లో వచ్చిన వత్తిడి, పగుళ్ల వల్లే భూమి కంపించిందని…ఇష్టానుసారంగా బోర్లు వేయడం, భూమి లోపల నీటి ఆనవాళ్లు లేకపోవడంతో భూమిలో పొరలు కదులుతున్నాయన్నారు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు కూడా భూప్రకంపనలకు కారణమే అన్నారు. ఒకసారి భూకంపం వస్తే కొద్ది రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందన్నారు.
మళ్ళీ మళ్ళీ భూమిలో శబ్దాలు రావొచ్చు. కానీ దాని తీవ్రత ఎక్కువగా ఉండదన్నారు. ప్రస్తుతం గచ్చిబౌలి మై హోమ్స్ విహంగ, ఐఐఐటీ ప్రాంతాల్లో సిస్మో మీటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.