విశాఖకు క్యాపిటల్ తరలింపు విషయంలో జగన్ వెనక్కు తగ్గారని, ఇక తరలింపులు ఉండవని ప్రచారాలు జరుగుతున్న నేపధ్యంలో జగన్ మళ్ళీ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ఈరోజు విజయవాడ కనకదుర్గ ప్లై ఓవర్ ఓపెన్ చేసిన అయన అనంతరం మాట్లాడుతూ విశాఖను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటలుగా చేస్తున్నామని, అందుకు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రత్యామ్నాయ రోడ్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.
బీచ్ రోడ్డు నుంచి భోగాపురం వరకు కోస్టల్ హైవేగా టేకప్ చేయమని ఆయన కోరారు. ఇక కేంద్రం నిర్మించే 22 గ్రీన్ ఫీల్డ్ రహదారుల్లో 6 గ్రీన్ ఫీల్డ్ రహాదారులు ఏపీ గుండా వెళ్లనున్నాయన్న అయన రూ. 2611 కోట్లను రోడ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో కేంద్రం కేటాయించిందని కానీ ఇప్పటి వరకు ఆ నిధులను విడుదల చేయలేదని అన్నారు. మొదటి, రెండు విడతల్లో రావాల్సిన రూ. 680 కోట్లు, రూ. 820 కోట్లు విడుదల చేయాలని గడ్కరీని కోరారు. వశిష్ట గోదావరి బ్రిడ్జి నిర్మాణానికి నిధుల అవసరం ఉందన్న అయన తీర ప్రాంత ప్రాంతాల కనెక్టివిటీ.. ఐదు పోర్టులకు అనుసంధానం కోసం నిధులు కేటాయించమని కోరారు.