జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదొక సంచలన నిర్ణయంతో…రాజకీయాలని వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే…అసలు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం, వాటిపై పెద్ద యుద్ధమే నడుస్తూ వస్తుంది. అలా జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో మూడు రాజధానులు ఒకటి…అసలు ప్రపంచంలోనే అరుదైన కాన్సెప్ట్‌ని జగన్ తీసుకొచ్చారు..మూడు ప్రాంతాలకు న్యాయం చేయడం కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకొచ్చామని చెప్పారు…కానీ దీని వెనుక రాజకీయ కోణం ఉందని సంగతి అందరికీ తెలిసిందే.
ఇక అమరావతిని శాసన రాజధానిగా ఉంచేసి…విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని జగన్ డిసైడ్ అయ్యి…అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకున్నారు…కానీ దీనికి మండలిలో బ్రేక్ పడింది..అలాగే కోర్టులో కూడా దీనిపై కేసులు పడ్డాయి. అయితే మూడు రాజధానుల బిల్లు సవ్యంగా లేకపోవడంతో కోర్టులో నిలబడదని జగన్ ప్రభుత్వానికి అర్ధమైంది…అందుకే కోర్టు తీర్పు రాకముందే మూడు రాజధానుల బిల్లుని రద్దు చేసుకున్నారు.
దీంతో అమరావతి రాజధానిగా ఉంటుందని అంతా అనుకున్నారు…కానీ జగన్ మళ్ళీ ట్విస్ట్ ఇస్తూ…మళ్ళీ సమగ్రమైన బిల్లు రూపోదించుకుని మూడు రాజధానులతో ముందుకొస్తామని జగన్ చెప్పారు. అయితే తాజాగా మూడు రాజధానుల బిల్లు త్వరలోనే తీసుకొస్తున్నామని మంత్రి కొడాలి నాని చెప్పారు. అంటే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చి ఆమోదించుకుంటారని అర్ధమవుతుంది.
అయితే ఈ సారి ఖచ్చితంగా మూడు రాజధానులు అమలు చేస్తామని చెబుతున్నారు. ఎలాగో అసెంబ్లీలో పూర్తి బలం ఉంది కాబట్టి అక్కడ బిల్లుకు ఇబ్బంది లేదు..ఎలాగో మండలిలో వైసీపీ బలం పెరిగింది..అక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మరి కోర్టులో కూడా అడ్డంకులు రాకుండా బిల్లుని రూపొదిస్తున్నారని తెలుస్తోంది. ఆ దిశగానే బిల్లుని పొందుపరిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంటే ఈ సారి మూడు రాజధానుల అమలుకు ఎలాంటి బ్రేకులు లేకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. మరి చూడాలి మళ్ళీ మూడు రాజధానులు ఏం అవుతుందో.