Ram Charan: RC15కి బ్రేక్..రామ్ చరణ్-ఉపాసన దంపతుల వివాహ వార్షికోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. తన నెక్స్ట్ ఫిల్మ్ RC15 షూటింగ్ లో ప్రజెంట్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ అప్ డేట్ కోసం మెగా ఫ్యా్న్స్ ఈ గర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ సంగతులు పక్కనబెడితే.. ఈనెల 14న రామ్ చరణ్- ఉపాసన దంపతులు తమ పదో వివాహ వార్షికోత్సం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ కోసం RC15 షూటింగ్ నుంచి కొద్ది రోజుల పాటు రామ్ చరణ్ బ్రేక్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

upasana ramcharan

ప్రొఫెషనల్ లైఫ్ లో ఫుల్ బిజీగా ఉండే సెలబ్రిటీ కపుల్..ఈ సారి వివాహ వార్షికోత్సం హ్యాపీగా జరుపుకోవాలని డిసైడ్ అయ్యారని టాక్. ఇటలీలోని మిలాన్ లో సెలబ్రేషన్స్ కోసం ప్లాన్ చేసినట్లు వినికిడి. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు ఈ సారి వార్షికోత్సవం ఘనంగా జరుపుకోబోతున్నారట. ఇకపోతే పదేళ్ల దాంపత్య జీవనం పూర్తయిన సందర్భంగా పిల్లల గురించి నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటారా? అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version