ఈవారం ఓటీటీ వేదికగా అలరించానున్న చిత్రాలు వెబ్ సిరీస్ ఇవే..

Entertainment ప్రతి వారంలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు.. వెబ్ సిరీస్ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.. అవి ఏంటో ఒకసారి చూద్దాం..

దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ప్రిన్స్ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. శివకార్తికేయన్‌ హీరోగా దర్శకుడు అనుదీప్‌ కె.వి. తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ తో ఉక్రెయిన్‌ నటి మరియా ర్యాబోషప్క టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది..

ఓటిటిలో ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూసిన మరొక చిత్రం కాంతారా.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది అయితే ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న.. వరాహరూపం ఒరిజినల్‌ వెర్షన్‌ లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. తెలుగు, కన్నడ, తమిళ్‌, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. అలాగే నవంబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్​లో ద స్విమ్మర్స్‌ (హాలీవుడ్‌), గ్లాస్‌ ఆనియన్‌ (హాలీవుడ్), బ్లడ్‌, సెక్స్‌ అండ్‌ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్‌) స్ట్రీమింగ్ అవుతుండగా.. ద నోయల్‌ డైరీ (హాలీవుడ్‌) నవంబరు 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

ఐదు విభిన్న కథల సమాహారంగా రూపుదిద్దుకున్న నాని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై రూపొందిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ మీట్‌ క్యూట్‌ నవంబరు 25 నుంచి సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్​లో గుడ్‌ నైట్‌ ఊపీ (మూవీ) నవంబరు 23, లెన్స్‌ (తమిళ్‌) నవంబరు 25న రిలీజ్ కానున్నాయి. అలాగే నెట్​ఫ్లిక్స్​లో ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌ (హిందీ/తెలుగు సిరీస్‌) నవంబరు 25, సోల్‌ బాయ్‌ (ఇంగ్లీష్‌) మూవీ నవంబరు 25, వెన్స్‌డే (వెబ్‌సిరీస్‌) నవంబరు 25, పడవేట్టు (మలయాళం) నవంబరు 25, బ్లడ్‌ అండ్‌ వాటర్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌)నవంబరు 25, గిష్‌లైన్‌ మ్యాక్స్‌వెల్‌: ఫిల్తీ రిచ్‌ (ఇంగ్లీష్‌-క్రైమ్‌ డ్యాకుమెంటరీ)నవంబరు 25 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.