జెఎన్‌యులో ఆదివారం సాయంత్రం జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మాస్క్ లు ధరించిన దుండగులు విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేసిన తరువాత దేశవ్యాప్తంగా విద్యార్దులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ముసుగు ధరించిన దుండగులు ఆదివారం క్యాంపస్‌పై దాడి చేయడంతో జెఎన్‌యు విద్యార్థులు ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దాడి జరిగిన కొన్ని గంటల తరువాత,
ఈ దారుణ సంఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు భారీగా వీధుల్లోకి వచ్చారు. ముంబైలో, విద్యా సంస్థల నుండి బయటకొచ్చిన విద్యార్థులు గేట్వే ఆఫ్ ఇండియా వద్ద గుమిగూడి నినాదాలు చేశారు. కొందరు దాడి వెనుక ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్ది సంఘం ఎబివిపికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జెఎన్‌యూ ఆస్తిని ద్వంశం చేసిన దుండగులపై కేంద్రం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బిజెపి జాతీయ ఐటి హెడ్ అమిత్ మాల్వియా మాట్లాడుతూ, కిరాయి సైనికులు దాడులు చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో, వారు క్యాంపస్‌లలో గొడవలు ప్రేరేపిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అధ్యయనం చేయడానికి మరియు వారి భవిష్యత్తును నిర్మించడానికి విశ్వవిద్యాలయాలకు పంపుతారని మరియు ఇలాంటి రాజకీయాల్లో పాల్గొనవద్దని మాల్వియా సూచించారు.