మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టేవాళ్ళు ఈ తప్పులు చెయ్యొద్దు…!

-

మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులుని చాల మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏమైనా తప్పులు కనుక చేస్తే డబ్బులని నష్ట పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ తప్పులు చెయ్యకుండా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు అని దీని మీద ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తరచూ చాల మంది కొన్ని తప్పులని చేస్తారు. కానీ ఆ అప్పులు మీరు చేయకుండా ఉండాలంటే వీటిని చూడండి.

ఇక ఆ తప్పులు ఏమిటి అనే విషయానికి వస్తే…. అనాలసిస్ చెయ్యాలి. అంటే చాల మంది లక్ష్యం తెలియకుండా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. ఫలాన వాళ్ళు ఇన్వెస్ట్ చెయ్యమన్నారు అని చేస్తుంటారు. కానీ అసలు అవగాహన ఉండకుండా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. అలానే అనాలసిస్ చేయరు. అలానే ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడం కన్నా ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో డబ్బులు పెట్టాలి గుర్తుంచుకోండి. ఇలాంటి వారికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ELSS అనువుగా ఉంటాయి. 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది గమనించండి. అందువల్ల స్వల్ప కాలిక ఆర్థిక లక్ష్యాలు కలిగిన వారికి ఈఎల్ఎస్ఎస్ అనువుగా ఉంటాయి.

అలానే మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను ఉంచుకోండి. దీని మూలంగా మీరు ఎటువంటి తప్పులు చేయకుండా మంచి స్టెప్ తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ఇలా ఉండగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్ కలిగి ఉండాలి. అంటే ఒకే తరహా ఫండ్స్‌లో డబ్బులు పెట్టకూడదు. ఒకే రకమైన ప్రాఫిట్ వస్తుంది అప్పుడు ఆ రాబడి మూలంగా లాస్ కలగవచ్చు. కొంచెం సహనం తో దీనిలో ఇన్వెస్ట్ చెయ్యాలి. అలానే ఇన్వెస్ట్ చేయడమంటే గ్యాంబ్లింగ్ కాదని గుర్తుపెట్టుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news