రైల్వే వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్..!

-

రైల్వే ఉద్యోగులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-శ్రమ్ పోర్టల్‌పై ఉన్న అసంఘటిత రంగ వర్కర్లు జాబితాలో మార్పు చేసింది కేంద్రం. ఇక్కడ దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రైల్వే వేర్‌హౌస్‌లలో పనిచేసే వర్కర్లు కూడా ఈ-శ్రమ్ పోర్టల్‌లో చేరచ్చు అని చెప్పింది. అయితే రైల్వే వేర్‌హౌస్‌లో పనిచేసే వర్కర్లు తమకు తాముగా ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఒకవేళ కనుక నమోదు చేసుకుంటే ఈ-శ్రమ్ కార్డు వస్తుంది. ఇప్పటి వరకు 24.45 లక్షలకు పైగా ఈ-శ్రమ్ కార్డులు జారీ చేసింది ప్రభుత్వం.

 

ఈ పోర్టల్ ద్వారా 38 కోట్ల మందికి ఈ-శ్రమ్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. అయితే నిర్మాణ రంగం లేదా అసంఘటిత రంగంలో పనిచేసే రోజువారీ కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రిషన్లు, నిర్మాణ సైట్లలో పనిచేసే వాచ్‌మెన్లు, వర్కర్లు ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకుంటే చక్కటి లాభాలని పొందడానికి అవుతుంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రయోజనాలు పొందొచ్చు కూడా. ఆగస్ట్ 2021లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకుంటే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను కూడా పొందవచ్చు. పీఎం శ్రమ్ యోగి మంధన్ యోజన ప్రయోజనాలను కూడా వర్కర్లకు కేంద్రం ఇస్తోంది. మంధన్ స్కీమ్ కింద కేవలం రోజుకు రూ.2 చెల్లించడం ద్వారా ఏడాదికి రూ.36 వేల పెన్షన్‌ను పొందడానికి అవుతుంది. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. ఈ పధకాన్ని 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి 40 ఏళ్ల వయసు వాళ్ళు వినియోగించుకోచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news