హైదరాబాద్‌ లో దారుణం..అర్ధరాత్రి వదినపై మరిది లైంగిక దాడి !

-

హైదరాబాద్‌ మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుషాయి గూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంపూర్ణ అనే మహిళ తన ఏడాదిన్నర చిన్నారి, మరో మహిళతో కలిసి నివాసం ఉంటోంది. అయితే.. రాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో.. సొంత మరిది వేణుగోపాల్‌ పీకల దాకా తాగి.. 10 మంది రౌడీలను వెంట తీసుకున్ని.. ఆమె ఇంటి తలుపులు బద్దలు కొట్లాడు. అనంతరం అసభ్యకరమైన పదజాలంతో.. దూసిస్తూ.. సొంత వదినపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

అక్కడి తో ఆగకుండా… సొంత వదినపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమహిళ కేకలు, చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. మహిళపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకోడానికి ప్రయత్నించారు. కానీ వారు అక్కడి నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో.. సంఘటనా స్థలంలోనే ఓ బైక్‌ ను వదిలేసి వెళ్లారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news