మందుబాబులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. త్వరలోనే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు నైట్ షిఫ్టులు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు ట్రాఫిక్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం రాత్రి10 గంటల వరకు మాత్రమే ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటున్నారు. ఆ తర్వాత వాహనదారులు… పీకల దాక తాగి.. అతి వేగంతో.. ప్రయాణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. గత రెండు నెలలుగా హైదరాబాద్ మహానగరంలో.. విపరీతంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ ట్రాఫిక్ ఉన్నతా ధికారులు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ లో… రాత్రి 11 నుంచి 2 గంటల వరకు స్పీడ్ లేజర్ గన్స్ ను ఉపయోగించి వాహనాల వేగాన్ని పరిశీలించనున్నారు. అమీర్ పేట- పంజాగుట్ట ప్రధాన రోడ్డులో రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల వరకు వాహానాల స్పీడ్ తో పాటు డ్రంకైన్ డ్రైవ్ కూడా నిర్వహించనున్నారు. ఈ తనిఖీల్లో దొరికిన వారిని జైళ్ లో వేసే చాన్స్ ఉంది.