తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని దేవరకొండ నుంచి కొండమల్లెపల్లి వెళ్లే దారిలో పెద్ద దర్గా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దర్గా సమీపంలో ఉన్న వసతి గృహాన్ని డీసీఎం ఢీ కొట్టింది. అందులో నిద్రిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముక్యంగా ఉదయం వేళలో మంచుకు డ్రైవర్ కి సరిగ్గా కనిపించకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
దేవరకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన హాజీ కుటుంబ సభ్యులు ఖాదర్, హబీ, నబీగ గా గుర్తించారు. దర్గా వద్ద వసతి గృహాన్ని ఢీ కొట్టడంతో రాల్లు మీద పడి వారు చనిపోయారని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.