జగిత్యాల మునిసిపాలిటిలో భూకుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాల మునిసిపాలిటిలో భూకుంభకోణం కేసులో ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్ అయ్యారు. అమీరుద్దీన్, ముజాకీర్, మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ జగిత్యాల మునిసిపాలిటిలో భూకుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. జగిత్యాల పట్టణం హస్నాబాద్లో 12 గుంటలకుగాను నకిలీ పత్రాలు సృష్టించిన నిందితులు.
కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే.. బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది ఈ భారీ భూకుంభకోణం. ఇప్పటికే దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు. మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు, మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు పోలీసులు. నిందితులపై 409, 420, 467, 471, 468, 120(b), r/w34 ఐపీసీ క్రింద కేసులు నమోదు చేశారు.