కృష్ణా బోర్డుకు జగన్ సర్కార్ మరో లేఖ.. విద్యుత్ ఉత్పత్తి ఆపండి !

-

కృష్ణా బోర్డు కు జగన్ సర్కార్ మరో లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ల్లో తెలంగాణ రాష్ట్రం  చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి లేఖ రాసింది ఏపీ. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వల్ల విలువైన నీరు వృధా అవుతోందని కేఆర్ఎంబీకి లేఖ రాసిన ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామల రావు.. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణా వాడుకున్న 113 టీఎంసీల నీటిని ఆ రాష్ట్ర వాటాలో వేయాలని కోరారు.

సెప్టెంబర్ 1 తేదీన జలసౌధలో జరిగిన 14 బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏ రాష్ట్రమైన నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్న ఏపీ సర్కార్.. నిబంధనలు ఏక పక్షంగా ఉల్లంఘిస్తున్న తెలంగాణ రాష్ట్రాని కి జరిమానా వేయాలని కోరారు. తెలంగాణా వాడుకున్న 113 టీఎంసీలను ఆ రాష్ట్ర నీటి వాటా 299 టీఎంసీల్లో భాగంగా పరిగణించాలని కోరింది ఏపీ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news