రాత్రిళ్ళు పులి గాండ్రింపులు, ఉదయం పశువుల మాంసం ముద్దలు…!

-

పెద్దపులి… ఇప్పుడు ఈ పేరు వింటేనే మహారాష్ట్ర- తెలంగాణా సరిహద్దు గ్రామాలు వణికిపోతున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళనతో ప్రాణహిత పరివాహక ప్రాంతం ఇప్పుడు భయం గుప్పిట్లో ఉంది. కవ్వాల్ టైగర్ జోన్ నుంచి అదిలాబాద్ అడవుల్లోకి పెద్ద పులులు అడుగు పెట్టాయి. ఒక రెండు పులులు, రెండు కూనలు సంచరిస్తున్నాయి. తాంసీకే అనే గ్రామాన్ని వణికిస్తున్నాయి.

గ్రామంలోకి రాత్రి వేళల్లో వస్తూ పశువులను చంపి తింటున్నాయి. రాత్రి వేళల్లో భయంకరమైన గాండ్రింపులతో పులి భయపెడుతుంది. ఉదయం లేచి చూస్తే పశువుల కళేభరాలు కనపడుతున్నాయి. దీనితో ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని గ్రామాలు పులి దెబ్బకు భయపడిపోతున్నాయి. గ్రామస్తులు నిత్యావసర సరుకుల కోసం కూడా బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఇక పిల్లలను కూడా స్కూల్ కి పంపించడం లేదు తల్లి తండ్రులు.

ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పులి జాడలను గుర్తించే పనిలో పడ్డారు. ఒక పులి రెండు కూనల జాడలను గుర్తించారు అధికారులు. ఇక అటవీ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుంది. ఇటు ప్రజలకు అటు పులులకు ఏ హాని లేకుండా ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

గ్రామస్తులు భయపడవద్దని అధికారులు కోరుతున్నారు. పులికి సంబంధించిన గుర్తులతో గాలింపు చేపట్టారు. ప్రాణహిత, పెన్ గంగా పరివాహక ప్రాంతంలోని దాదాపు 36 గ్రామాలు ఈ పులి దెబ్బకు భయపదిపోతున్నాయి. ఎప్పుడు వచ్చి తమ మీద పులి పంజా విసురుతుందో అనే భయం గ్రామస్తులను తీవ్రంగా భయపెడుతుంది. దీనితో చాలా వరకు గ్రామస్తులు పొలాలకు కూడా వెళ్ళడం మానేశారు.

Read more RELATED
Recommended to you

Latest news