తెలంగాణ పులలకు ఆవాసంగా మారుతోంది. వరసగా పశువులపై, మనుషుల పై దాడులు చేస్తూ కలవరం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎక్కడోచోట పులి ఆనవాళ్లు, దాడులు తరుచుగా జరుగుతున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ సమీపంలోని అనకోడ వద్ద అర్ధరాత్రి పులి హల్చల్ చేసింది. ఒక ఆవును చంపింది. ఇది గమనించిన గ్రామస్థులు కర్రలతో పులిని తరిమారు. కాగా ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పులుల సంఖ్య పెరిగినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. దీంతో పులుల మధ్య ఘర్షణ ఏర్పడి గ్రామాల వైపు వస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అనుకుని మహారాష్ట్రలో తాడోబా, చత్తీస్గడ్ లో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లు ఉండటంతో పులుల రాకపోకలు ఎక్కువయ్యాయి. దీంతో పులుల రాకపోకలకు ఆసిఫాబాద్ జిల్లా ముఖ్య కారిడార్ గా ఏర్పడింది. ఈ జిల్లా పరిధిలోని దహేగాం, కాగజ్నగర్ అటవీ పరిధిలోని గ్రామాల్లో తరుచు పులుల దాడులు జరుగుతున్నాయి.
పులికలకలం.. అర్థరాత్రి హల్చల్..
-