Nayanthara: ప్రియుడితో క‌లిసి శ్రీ‌వారిని సంద‌ర్శించుకున్న లేడీ సూప‌ర్ స్టార్‌

-

Nayanthara: ప్రముఖ నటి, లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడు, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‏తో కలిసి తిరుమల తిరుప‌తి శ్రీవారిని దర్శించుకున్నారు. వారిద్ద‌ర‌రూ త‌మ‌ కుటుంబ సభ్యులతో క‌లిసి సోమవారం ఉద‌యం ద‌ర్శ‌నం చేసుకున్నారు. విఐపి బ్రేక్ ప్రారంభ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారికి ప్ర‌త్యేక కానుక‌లు, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేద ఆశీర్వచనం పలికారు. అనంత‌రం ఆలయ అధికారులు వారిని స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్ల నుండి డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది ముద్దుగుమ్మ న‌య‌న్‌. తాజాగా తన కాబోయే భర్త విగ్నేష్ శివన్ చెప్ప‌క‌నే చెప్పింది. ఇటీవల ఓ రియాల్టీ షోలో నయన్.. తన వేలికి ఉన్న రింగ్ చూపిస్తూ.. స్పెషల్ అని .. విగ్నేష్‌తో నిశ్చితార్థం అయిన విషయాన్ని బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. త్వ‌ర‌లోనే వారిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. తమిళ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. న‌య‌న్ పుట్టిరోజు సంద‌ర్భంగా.. ఇద్దరు కలిసి ఫారెన్ టూర్స్ కి వెళ్లారు. వీటికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ కావ‌డంతో ఆ వార్త‌లు నిజ‌మేన‌ని పిలిస్తుంది. అలాగే.. ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news