ఏపీ శాసనరాజధానిలో తిరుగుతున్న చిన్నపులి… వాపా – బలుపా?

-

ఇంతకాలం కరోనా భయానికి పార్టీని ప్రజలను పక్కన పెట్టి భాగ్యనగరంలో రెస్ట్ తీసుకుంటున్న బాబు & చినబాబులు ఏపీ శాసన రాజధాని అమరావతికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతి వరకూ వచ్చినా కూడా చంద్రబాబు ఆన్ లైన్ కే పరిమితమైతే.. చినబాబు లోకేష్ మాత్రం రాజ‌ధాని ప్రాంతాన్ని సంద‌ర్శించేందుకు వెళ్లారు!


అవును.. కేవలం తమ పార్టీ నేతలు అవినీతికేసుల్లోనో, అక్రమాల కేసుల్లోనో, మర్డర్ కేసుల్లోనో అరెస్టయితే వారిని పరామర్శించడానికి మాత్రమే ఇల్లు కదిలి బయటకు వచ్చిన చినబాబు తాజాగా అమరావతి ప్రాంతానికి చెందిన కొంతమంది ల‌బ్ధిదారులు చేప‌ట్టిన ఆందోళ‌న నేటికి 300 రోజులు పూర్తి చేసుకొన్న సందర్భంగా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు! ఇందులో భాగంగా ఉద‌యం 9.15 గంట‌ల‌కు పెన‌మాక‌, 10 గంట‌ల‌కు ఎర్ర‌బాలెం, 10.40కి కృష్ణాయ‌పాలెం, 11.30 గంట‌ల‌కు తుళ్లూరు, 12.15 గంట‌ల‌కు దొండ‌పాడు గ్రామాల్లో ప‌ర్య‌టించారు చినబాబు!

అయితే టీడీపీ భవిష్యత్తు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా గా మారిన తరుణంలో… ఇంతకాలానికి ఆ నలుగురికోసమైనా కానీ బయటకు వచ్చిన చినబాబుని చూసి… ఏపీ శాసన రాజధానిలోకి మా చిన్నపులి వచ్చిందని సంబరపడిపోతున్నారంట! ఎన్నాలైంది చిన్నా మిమ్మల్ని చూసి అని ఆప్యాయత చూపిస్తున్నారంట! కాకపోతే… చినాబాబు రాక పర్మినెంటా లేక చుట్టంచూపా అన్న విషయం గురించి మాత్రం తెగ ఆలోచిస్తున్నారు తమ్ముళ్లు!

ఇంతకాలానికి ధైర్యం చేసిన జనాల్లోకి వచ్చిన చినబాబు… ఇక జనాల్లోనే ఉంటారా.. జనాలకు అందుబాటులోనే ఉంటారా.. లేక మళ్లీ గూట్లోకి వెళ్లిపోతారా.. అని ఆలోచిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు! ఆయన గనుక ఇకనుండైనా జనాల్లో ఉంటే పార్టీ బలపడుతుందని.. అలాకానిపక్షంలో పండగనికి పబ్బానికి ఇలా చుట్టం చూపుగా వచ్చి వెళ్లడం వల్ల అది కేవలం వాపుగా మాత్రమే ఉంటుందని అంటున్నారు!!

మరి చినబాబు ఇప్పటికైనా పార్టీ బాధ్యతలు తీసుకుని రంగంలోకి దిగుతారా లేక మళ్లీ గూట్లోకి దూరిపోతారా అన్నది తెలియాలంటే మంగళవారం వరకూ వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news