ప్రియుడి బర్త్ డే వేడుకలో ‘శృతి’ మించిన కమల్ హాసన్ కూతురు..శంతనుపై ముద్దుల వర్షం..

-

లోకనాయకుడు, విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.. సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న సంగతి అందరికీ విదితమే. నటిగానే కాకుండా సింగర్ గానూ ఈ భామ మంచి పేరు సంపాదించుకుంది. తెలుగునాట ఈ భామ నటించిన ఫిల్మ్స్ చక్కటి ఆదరణ పొందాయి.ప్రజెంట్ సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో చిత్రాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది శృతి.

శృతిహాసన్ ప్రస్తుతం శంతును హజారికా అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో ఉందని తెలుస్తోంది. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ శంతనుతో దిగిన ఫొటోలను శృతి అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది కూడా. శంతును బర్త్ డే సందర్భంగా శృతి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. శంతను బర్త్ డే వేడుకలో శ్రుతి రెచ్చిపోయి మరి హాట్ బాంబ్ లా పేలింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేయగా, అవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ట్రెండీ డ్రెస్ లో క్లీవేజ్ కనబడేలా రచ్చ రచ్చ చేసింది శ్రుతి. అలా శంతను బర్త్ డే వేడుకలో శృతి హాసన్ మెరిసిపోయింది. తన ప్రియుడితో ఘాటు రొమాన్స్ లో భామ ఉందని ఈ సందర్భంగా అర్థమవుతోంది.

బర్త్ డే పార్టీలో శంతనుపై ముద్దుల వర్షం కురిపించిందట. అది కూడా లిప్ కిస్సులే కావడం గమనార్హం. మొత్తంగా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తోంది. శ్రుతి హాసన్ ప్రజెంట్ టాలీవుడ్ సీనియర్ హీరోలతోనూ యాక్ట్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో పవన్ కల్యాణ్, చరణ్, బన్నీలతో కలిసి నటించిన శ్రుతి.. ప్రజెంట్ చిరుతోనూ జోడీ కడుతోంది.

https://www.instagram.com/p/Cbu0NA9hetc/

Read more RELATED
Recommended to you

Latest news