భారత్‌లో పులులు పెరుగుతున్నాయ్‌.. NTCA సర్వేలో వెల్లడి

-

జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ(ఎన్టీసీఏ) ఓ శుభవార్త చెప్పింది. దేశంలో పులుల సంఖ్య బాగా పెరిగిందని వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంత విస్తృతంగా 2022లో పులులపై సర్వే జరిపామని తెలిపింది. శివాలిక్‌, గంగా మైదానం, మధ్య భారతం, ఈశాన్య భారత పర్వతాలు, బ్రహ్మపుత్ర మైదానాల్లో పులులు పెరిగాయని.. పశ్చిమ కనుమల్లో మాత్రం తగ్గాయని. ఇక్కడ 2018లో 981 పులులు ఉండగా.. 2022లో అవి 824కు తగ్గిపోయాయని వివరించింది. ఈ సంస్థ 2022లో పులుల స్థితిగతుల పేరుతో వెలువరించిన నివేదికను ఆదివారం మైసూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.

 

20 రాష్ట్రాల్లో కాలినడకన మొత్తం 6,41,499 కిలోమీటర్ల దూరం తిరిగి సర్వే నిర్వహించారు. ఎన్టీసీఏ అధికారులు, జీవ శాస్త్రజ్ఞులు, వాలంటీర్లు సర్వేలో పాల్గొన్నారు. అడవుల్లో 32,588 చోట్ల ఏర్పాటు చేసిన రహస్య కెమేరాలు మొత్తం 4,70,81,881 ఫొటోలను తీశాయి.  ప్రపంచంలో ఇంతటి విస్తారమైన వన్యప్రాణి సర్వే మరెక్కడా జరగలేదని ఎన్టీసీఏ నివేదిక వెల్లడించింది. సర్వే ఆధారంగా భారతదేశంలో కనీసం 3,167 పులులు ఉన్నాయని భావించవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ అధికారి ఒకరు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news