రేపు ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ రిలీజ్

-

సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా డీజె టిల్లు సినిమాతో ఈ యంగ్ హీరో ఫేమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది. టిల్లు బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం రొమాంటిక్ క్రైమ్ కామెడీ ‘టిల్లు స్క్వేర్’.మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో రిలీజ్ ట్రైలర్ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రేపు టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్స్, సాంగ్ విడుదల అయి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెంచాయి.

Read more RELATED
Recommended to you

Latest news